నల్లగా కనిపించడం కోసం మేకప్‌ వేసుకుందట !

Published on Mar 16, 2021 8:25 am IST

యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ ‘‘గీతా ఆర్ట్స్‌లో నా మూడో చిత్రమిది. ఈ సంస్థ నాకు లక్కీ ఛార్మ్‌. ఇక విశాఖ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పాత్రకు తగ్గట్టు కొంచెం నల్లగా కనిపించడం కోసం మేకప్‌ వేసుకున్నా. నేను మాసీ సినిమాలో క్లాసీ క్యారెక్టర్‌ చేశా. అని చెప్పుకొచ్చింది.

కాగా ఈ సినిమాలో ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. అలానే ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ లో చిందేశారు. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :