వరుణ్ బాక్సింగ్ మూవీలో మరో హీరోయిన్ ?

వరుణ్ బాక్సింగ్ మూవీలో మరో హీరోయిన్ ?

Published on Mar 27, 2020 11:30 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం వరుణ్ విదేశాల్లో బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. కొత్త మెకోవర్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా అన్ని విధాల కొత్తగా ఉండాలని భావించిన దర్శక నిర్మాతలు హీరోయిన్ పాత్రలో కనబడబోయే అమ్మాయి కూడా కొత్త ఫేస్ అయితే బాగుంటుందని బాలీవుడ్ జల్లెడపట్టి సాయి మంజ్రేకర్ ను తీసుకొవాలనుకుంటున్నారు.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందట. కాకపోతే కేవలం చిన్న ప్లాష్ బ్యాక్ లో మాత్రమే ఉంటుందట. ఇప్పుడు ఆ పాత్రలో లావణ్య త్రిపాఠిను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈమె ఎంపిక పై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఇకపోతే అల్లు బాబీ, సిద్దు ముద్దలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు