కోటి రూపాయలతో బాలయ్య కోసం పాట!!

కోటి రూపాయలతో బాలయ్య కోసం పాట!!

Published on Nov 16, 2015 12:50 PM IST

dictatoot

నందమూరి బాలకృష్ణ ప్రతి సినిమాతోనూ ఏదో ఒక కొత్త వైవిధ్యాన్ని చూపి తెలుగు ప్రేక్షకులను, అభిమానులను మెప్పించడానికి తన కృషి చేస్తుంటాడు. కథను నమ్మితే ఏం చేయడానికైనా సిద్దపడతాడు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాటని బాలకృష్ణపై షూట్ చేస్తున్నారు.. పాటే కదా అందులో ఏముంది అని అనుకోకండి.. ఎందుకంటే ఈ పాట కోసం ఈ చిత్ర టీం సుమారు కోటి రూపాయలపైనే ఖర్చు పెడుతోంది.

ఇక అసలు విషయంలోకి వెళితే.. రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్యపై షూట్ చేస్తున్న పాట కోసం ఓ భారీ సెట్ ని వేసారు.. ఈ పాటలో బాలయ్యతో పాటు 100 మంది డాన్సర్స్ పాల్గొంటున్నారు. సుమారు రోజుకి 30 లక్షలపైనే ఖర్చు పెట్టి షూట్ చేస్తున్న ఈ పాటని మరో రెండు రోజులు షూట్ చేయనున్నారు. ఓవరాల్ గా ఈ పాటకి కోటి రూపాయలపైనే ఖర్చు చేయనున్నట్లు ఈ చిత్ర టీం తెలిపింది. కంటెంట్ కి తగ్గట్టుగానే సినిమాని కూడా బాగా లావిష్ గా షూట్ చేయడంలో ప్రొడక్షన్ టీం ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని సమాచారం.

బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ అందించిన మ్యూజిక్ ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నాడు.

తాజా వార్తలు