అఖిల్ సినిమాలో స్పెషల్ సాంగ్.. లావిష్‌గా ఉంటుందట

అఖిల్ సినిమాలో స్పెషల్ సాంగ్.. లావిష్‌గా ఉంటుందట

Published on Dec 8, 2019 10:10 PM IST

అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే టాకీ పార్ట్ చాలా వరకు ముగించిన టీమ్ ఇటీవలే పెద్ద మొత్తం ఖర్చుపెట్టి సౌదీలో ఒక రొమాంటిక్ సాంగ్ తీశారు. ఇప్పుడు మరొక పాటను హైదరాబాద్లో షూట్ చేయనున్నారు.

ఈ పాట కోసం కూడా ఎక్కువ మొత్తంలోనే వెచ్చిస్తున్నారట నిర్మాతలు. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రఫర్ రఘు మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. ‘మిష్టర్ మజ్ను’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమా మీద అఖిల్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఇక దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సైతం చాన్నాళ్ల తర్వాత చేస్తున్న సినిమాతో నిలదొక్కుకోవాలని గట్టిగా భావిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు