96 తెలుగు రీమేక్ ఫై క్లారిటీ వచ్చింది !

Published on Jan 18, 2019 7:15 pm IST


కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ’96’ తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారన్న విషయం తెలిసిందే. కాగా ఈ రీమేక్ లో హీరోహీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారనే విషయం ఫై ఇటీవల కొందరి పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే ఆ వార్తలపై చిత్ర యూనిట్ స్పదించకపోవడంతో అవి రుమార్లుగానే మిగిలిపోయాయి. ఇక ఎట్టకేలకు ఈ రీమేక్ లో నటించే హీరో హీరోయిన్లతో పాటు ఎవరు డైరెక్ట్ చేయనున్నారన్న విషయం ఫై కూడా క్లారిటీ వచ్చింది.

యువ హీరో శర్వానంద్ , సమంత జంటగా నటించనున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈచిత్రం గురించి అధికారికంగా మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఇక విజయ్ సేతుపతి ,త్రిష జంటగా నటించిన 96 చిత్రం గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం కన్నడలో కూడా రీమేక్ అవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More