‘వారణాసి’ లీక్స్ చిన్న మ్యాటర్.. అంతకు మించి మరోటి ఉంది.!

Varanasi

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి, మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా నుంచి వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం ప్రపంచ సినిమానే ఎదురు చూస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఊహించని లీక్స్ మొదటి నుంచే వచ్చేసాయి.

రాజమౌళి భారీ సినిమాలు అన్నిటికీ ఇలానే జరిగింది. RRR, బాహుబలి వంటి సినిమాల్లానే దీనికి కూడా లీక్స్ బెడద తప్పలేదు. అలానే లేటెస్ట్ గా వారణాసి సెట్స్ కి సంబంధించి కొన్ని లీక్స్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ఇది చాలా చిన్న మ్యాటర్ అనే అనుకోవాలి. అసలు నటీనటులు కూడా కనిపించని చిన్నపాటి లీక్స్ అవి అన్నట్టు తెలుస్తుంది.

కానీ దీనికి మించిన మరో బిగ్ థింగ్ ఒకటి ఉన్నట్టు ఇపుడు తెలుస్తుంది. అది ఈ ఆగస్టులో రివీల్ కానున్నట్టుగా టాక్. ఈ ఆగస్టు నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఓ సాలిడ్ ట్రీట్ ‘వారణాసి’ సినిమా నుంచి రావడం గ్యారెంటీ అని ఇప్పుడు గట్టి బజ్ వినిపిస్తుంది. సో ఆ లీక్స్ అనేవి దీని ముందు చిన్న విషయమే అనుకోవాలి. ఇంకా ఆగస్టుకి సమయం ఉంది కాబట్టి నెమ్మదిగా దీనిపై అఫీషియల్ క్లారిటీ రానుంది.

Exit mobile version