నేను ఏమైనా కొత్త విషయాలు నేర్చుకున్నాను అంటే అది నా ప్లాప్ సినిమాల నుండే నేర్చుకున్నాను. ఆ సినిమా తీసిన నిర్మాతకి డబ్బులు రాలేదనే చిన్న బాధ తప్పితే, ప్రతి ప్లాప్ సినిమా ఓ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు రామ్ చరణ్.
మెగస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్, 8 ఏళ్ళ కెరీర్ లో 8 సినిమాలు చేశాడు. మిగతా హీరోల కంటే సక్సెస్ రేట్ ఎక్కువ. అత్యధిక సినిమాలు 40 కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరాయి. ‘మగధీర’ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
‘ఆరెంజ్’, బాలీవుడ్ ఎంట్రీ ‘జంజీర్’ (తెలుగులో ‘తుఫాన్’ పేరుతో విడుదలయ్యింది) సినిమాలు డిజాస్టర్లుగా ముద్ర పడ్డాయి. కథను నమ్మి ఆ సినిమాలను తీశాం. ఎక్కడో చిన్న చిన్న తప్పిదాలు జరిగాయి. వాటి నుండి నేను చాలా నేర్చుకున్నాను. మంచి కథతో మరోసారి బాలీవుడ్ లో సినిమా చేస్తాను అని చరణ్ అన్నారు. ఇటివల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో చరణ్ ఈ వ్యాఖలు చేశారు.


