బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ మృతి

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ మృతి

Published on Jul 7, 2021 8:50 AM IST

Dilip Kumar

బాలీవుడ్ వర్గాల్లో మరియు ఇండియన్ సినిమా దగ్గర మరో తీరని విషాదం చోటు చేసుకుంది. జస్ట్ కొన్ని రోజులు కితమే ప్రముఖ నటి మందిరా బేడీ భర్త ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ కౌశల్ మృతి చెందారు అన్నదే తీవ్ర విషాదం నెలకొల్పగా ఇప్పుడు మరో బాలీవుడ్ లెజెండరీ వెటరన్ నటుడు దిలీప్ కుమార్ లేరు అనే వార్త బాలీవుడ్ వర్గాలు సహా ఇండియన్ సినిమా ప్రేమికులను కలసి వేసింది.

ఎన్నో వందల చిత్రాల్లో నటించిన ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా ఈరోజు బుధవారం ఉదయమే తన 98వ ఏట తుది శ్వాస విడిచినట్టుగా ఆయన అధికారిక సోషల్ మీడియా టీం వ్యక్త పరిచింది. అయితే ఆయన బీపీ మరియు షుగర్ లెవెల్స్ ఒకేసారి పడిపోవడంతో శ్వాస తీసుకోవడం కలిగి ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్టుగా వైద్యులు తెలిపారు. దీనితో ఈ విషాదకర వార్త బయటకి రావడంతో బాలీవుడ్ వర్గాలు దిగ్బ్రాంతికి లోనయాయ్యి. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఓం శాంతి.

https://twitter.com/TheDilipKumar/status/1412600233062699008?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు