
టాలీవుడ్ గర్వించదగ్గ ఆర్టిస్ట్ మరియు ప్రతి సినిమాని అద్భుతమైన దృశ్య కావ్యంలా చూపించిన లెజండ్రీ దర్శకుడు స్వర్గీయ బాపు. ఆయన ఇటీవలే స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన చివరి చిత్ర లేఖనాన్ని త్వరలో రానున్న ఓ తెలుగు సినిమా కోసం వాడుకున్నారు. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘కుందనపు బొమ్మ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఈ చిత్ర టీం బాబు గారు డిజైన్ చేసిన ఓ పెయింటింగ్ ని వాడుకున్నారు.
ఇక్కడ విషయం ఏమిటంటే ఈ పెయింటింగ్ ని వాడుకోవడానికి ప్రధాన కారణం కుందనపు బొమ్మ డైరెక్టర్ ముళ్ళపూడి వర కావడం. బాపు కి లైఫ్ టైం ఫ్రెండ్ అయిన ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడే ముళ్ళపూడి వర. ఈ రిలేషన్ షిప్ వలన ముళ్ళపూడి వర తన కుందనపు బొమ్మ సినిమా కోసం బాబు గారి పెయింటింగ్ ని వాడుకున్నారు. కె. రాఘవేంద్ర రావు ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుధాకర్, చాందిని చౌదరి, సుదీర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

