లెజండ్రీ మ్యూజిక్ కంపోజర్ ఇకలేరు.!

లెజండ్రీ మ్యూజిక్ కంపోజర్ ఇకలేరు.!

Published on Jul 14, 2015 10:29 AM IST

ms-viswanad
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సంగీత చక్రవర్తి లెజండ్రీ మ్యూజిక్ కంపోజర్ ఎంఎస్ విశ్వనాథన్ గారు ఈ రోజు ఉదయం చనిపోయారు. 87 సంవత్సరాల వయసున్న విశ్వనాథన్ గారు కొద్ది రోజులుగా శ్వాసకోస వ్యాధితో గత కొద్ది నెలలుగా బాధపడుతున్నారు. డాక్టర్స్ ఆయన్ని ఐసియులో ఉంచి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆరోగ్యం కాస్త మెరుగయ్యింది, కానీ సడన్ గా వచ్చిన ఇబ్బంది వలన ఆయన ఈ రోజు ఉదయం 4:30నిమిషాల సమయంలో కన్నుమూశారు.

విశ్వనాథన్ గారు తన సంగీతంతో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. తమిళ స్టార్ హీరో శివాజీ గణేషన్ నటించిన పనం సినిమాతో 1952లో తన కెరీర్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ ప్రస్థానంలో ఆయన తెలుగు, తమిళ, మలయాళ భాషలను కలుపుకొని సుమారు 750కి పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసారు. విశ్వనాథన్ గారు ఎంతో మంది లెజండ్రీ దిరెచ్తొర్స్ తో కలిసి పనిచేసారు. కె. బాలచందర్ తో కల్సి మరో చరిత్ర, ఆకలి రాజ్యం, అంతులేని కథ, 47 రోజులు అనే పలు సినిమాలకు సంగీతం అందించాడు.

ఎంఎస్ విశ్వనాథన్ మరణంతో శోఖ సముద్రంలో మునిగిన్ వారి కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపం తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు