“సర్దార్ 2” కోసం లియో రైటర్!

“సర్దార్ 2” కోసం లియో రైటర్!

Published on Jan 30, 2024 11:06 PM IST

ప్రతి సినిమాతో ఏదో ఒకటి డిఫరెంట్ గా ట్రై చేసే కార్తీ చివరిసారిగా జపాన్ చిత్రం తో ఆడియెన్స్ ముందుకి వచ్చాడు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అతను ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న వా వాతియారే షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నాడు. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన నటుడి స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ సర్దార్ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ 2023లో ప్రకటించబడింది. ఈ సంవత్సరం సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా సమాచారం ప్రకారం, లియో కో రైటర్ అయిన రత్నకుమార్ సర్దార్ 2 స్క్రిప్ట్‌పై పిఎస్ మిత్రన్‌తో కలిసి పని చేయనున్నారు. లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో రత్నకుమార్ ఒక చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటంతో రత్నకుమార్ తన దృష్టిని ఇతర సినిమాలపైకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌కి జివి ప్రకాష్ కుమార్ స్థానంలో యువన్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ సర్దార్ 2ని బ్యాంక్రోల్ చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు