మహేష్ సినిమాది అబద్దం.. ప్రభాస్ సినిమాలో నిజం

మహేష్ సినిమాది అబద్దం.. ప్రభాస్ సినిమాలో నిజం

Published on May 19, 2024 9:00 AM IST

మన టాలీవుడ్ అగ్ర తారలు ఇప్పుడు రూటు మార్చి పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరించేందుకు మాసివ్ ప్రాజెక్ట్ లు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ అపీల్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. అలా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి పలు భారీ చిత్రాలు ఇప్పుడు రాబోతుండగా వాటిలో టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న చిత్రం “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD) కూడా ఒకటి.

మరి ఈ చిత్రం నుంచి నిన్న వచ్చిన ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియో (Kalki Bujji) మంచి బజ్ ని సంతరించి పెట్టింది. ఇంకా ఈ వీడియోలో ఒక్క పర్టిక్యులర్ పార్ట్ మాత్రం అందరికీ ఆల్రెడీ ఎపుడో చూసినట్టు అనిపించింది. ప్రభాస్ భుజంపై ఉన్న బుజ్జి రోబోట్ స్టిల్ చూస్తే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన “స్పైడర్” (Spyder) గ్లింప్స్ లో చూసినట్టే అనిపిస్తుంది.

ఇక దీనితో రెండు సినిమాలకి పోలుస్తూ సోషల్ మీడియాలో మొదలు పెట్టారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే స్పైడర్ సినిమాలో అది కేవలం గ్లింప్స్ లోనే చూపించి సినిమాలో చూపించకుండా మురుగ దెబ్బేసాడు. సో అది అబద్దం. కానీ ప్రభాస్ సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా నిజం అని చెప్పాలి. సో రెండు సినిమాలకి పోల్చడం అనవసరమే అనుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు