‘లైఫ్‌ ఆంథెమ్‌’ పై పూరి కొత్త పాఠం !

‘లైఫ్‌ ఆంథెమ్‌’ పై పూరి కొత్త పాఠం !

Published on Jun 19, 2021 8:02 PM IST

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన పూరీ మ్యూజింగ్స్‌ లో భాగంగా ఈ రోజు ‘లైఫ్‌ ఆంథెమ్‌’ అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లో.. ‘ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం. ఈ జీవితంలో ఎవరూ నీ కోసం పుట్టలేదు, కేవలం ఈ జీవితం నీది. ఏం చేసినా నీ కోసమే చెయ్‌. నీకు నచ్చిందే చేసేయ్. నువ్వు కూడా ఎవ్వరి కోసం పుట్టలేదు. అందుకే నీకు నచ్చినట్టుగా ఉండు అంటూ మనిషి ఎలా ఉండాలో చెప్పుకొచ్చిన పూరి, మన బతుకే మూణ్నాళ్ల ముచ్చట అని ఇక 16 రోజుల పెళ్లెందుకు? అసలు ఈ బానిస బతుకెందుకు? అని పూరి తెలిపాడు.

అలాగే ఈ జీవితంలో పెళ్లి అనే ఒక్క తప్పు చేస్తే ఇక ఆ తరువాత ఎన్ని ఫిలాసఫీలు చదివినా ఎలాంటి ఉపయోగం ఉండదు అని, ఎవ్వరికీ మాట ఇవొద్దు అని, నీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకో. అలాగే దేనికి భయపడకు. శాంతంగా ఉండడం నేర్చుకో. ఒక పదిమందికి నీ చేతితో తిండిపెట్టు. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, 70 లేదా 80 ఏళ్లు వచ్చినా సరే, నీ పనులు నువ్వు చేసుకోగలిగితే చాలు. ఎందుకంటే క్లైమాక్స్‌ బాగుంటేనే సినిమా సూపర్ హిట్‌ అవుతుంది. మేక్‌ యువర్‌ లైఫ్‌ ఏ బ్లాక్‌బస్టర్‌’ అంటూ పూరి తన పాయింట్ ఆఫ్ వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు