
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే సౌత్ ఇండియన్ సినీ అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి. ఆ పండుగ డిసెంబర్ 12న లింగ సినిమా రూపంలో వచ్చింది. సౌత్ లో మొత్తం డిసెంబర్ 12న రిలీజ్ అయిన రజినీకాంత్ లింగ తమిళ ప్రేక్షకులను మాత్రం కొంతవరకూ మెప్పించగలిగింది. అనుకున్న స్థాయి అంచనాలను అందుకోలేకపోయినా అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా రెండు వారల గ్యాప్ తో ఈ రోజు హిందీలో రిలీజ్ అయ్యింది.
రజినీకాంత్ స్టైల్ మరియు యాక్షన్ కి ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా హెల్ప్ అవుతుందని ఈ సినిమాని ట్రిమ్ చేసి హిందీలో రిలీజ్ చేసారు. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్ డాల్స్ అయిన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

