
ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రాఫికల్ వండర్ ‘బాహుబలి’. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటే ఈ సినిమా బిజినెస్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా తమిళ రైట్స్ ని యువి క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నారని తెలియజేశాం.
తాజాగా ఈ తమిళ సినిమా రిలీజ్ లో తమిళ టాప్ డైరెక్టర్ లింగుస్వామి కూడా చేరాడు. లింగుస్వామి యువి క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేయనున్నాడు. లింగుస్వామి సమర్పణలో ఈ సినిమా తమిళ రిలీజ్ ఉంటుంది. హిందీలో ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కరణ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని మే చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.