బి, సి సెంటర్స్ లో లయన్ కి భారీ ఓపెనింగ్స్

lion

‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘లయన్’. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. అన్ని చోట్ల నుండి మాస్ ని మెప్పించే మాస్ సినిమాగా టాక్ తెచ్చుకుంటోంది. బాలయ్య సినిమా అంటే మా ఆడియన్స్ కి పండగనే చెప్పాలి. ఈ సినిమాకి బి, సి సెంటర్స్ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అందుకే బి, సి సెంటర్స్ లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఏరియాల్లో బి, సి సెంటర్స్ నుంచి క్రేజీ కలెక్షన్స్ వస్తున్నాయి.

మొట్ట మొదటిసారిగా ఓవర్సీస్ లో బాలకృష్ణ ‘లయన్’ సినిమా ఓవర్సీస్ మొత్తంలో సుమారు 100 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా ప్రీమియర్ షోస్ కి, రెగ్యులర్ షోస్ కి ఫుల్ క్రేజ్ ఉంది. సత్య దేవ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో నందమూరి అభిమానులు మెచ్చుకునే అంశాలు ఉండడంతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.

Exit mobile version