
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. సక్సెస్ఫుల్ ‘లెజెండ్’ సినిమాలోలానే బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను రేపు జరుపుకోనుంది. ఈ సినిమా రిలీజ్ కోసం డిసైడ్ చేసిన ఓ ప్రత్యేక ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసారు. రేపు సాయంత్రం కల్లా ఈ సినిమా సెన్సార్ వివరాలు తెలిసిపోతాయి.
ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ మొదటిసారి ఓ పాత్రలో సిబిఐ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ స్పెషల్ గా డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అవుతాయని సమాచారం. సత్యదేవా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

