పూరీ ‘లోఫర్’ సినిమాకు కొత్త విలన్..!

పూరీ ‘లోఫర్’ సినిమాకు కొత్త విలన్..!

Published on Jul 27, 2015 3:39 PM IST

Charandeep
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ‘జిల్లా’ సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగు నటుడు చరణ్‌దీప్. ఆ తర్వాత తెలుగులో ‘పటాస్’, ‘వినవయ్యా రామయ్యా’ సినిమాలతో మెప్పించిన చరణ్‌ ప్రస్తుతం ‘బాహుబలి’, ‘పులి’ లాంటి భారీ సినిమాలతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుణ్ తేజ్‌తో చేస్తోన్న ‘లోఫర్’ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

పూరీ సినిమా అంటే ప్రతిసారీ హీరో క్యారెక్టర్‌తో పాటు విలన్ క్యారెక్టర్‌కూ ఓ సరికొత్త ఐడెంటిటీ ఇస్తుంటారు. ఆ కోవలోనే లోఫర్‌ ద్వారా మరో సరికొత్త విలన్‌ పాత్రను డిజైన్ చేశారట. ఈ రోల్‌లో చరణ్‌దీప్ సెలెక్ట్ కావడం విశేషం. ఇక ప్రస్తుతం పూరీ-వరుణ్‌ల సినిమా గత కొద్ది రోజుల క్రితం అఫీషియల్‌గా లాంచ్ అయి ప్రస్తుతం జోధ్‌పూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే! సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో దిశా పనాయ్ హీరోయిన్‌గా నటిస్తోంది

తాజా వార్తలు