
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన ఆరడుగుల యంగ్ హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘లోఫర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా అధికారికంగా నిన్ననే లాంచ్ అయ్యింది. అలాగే నేటి నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. మరో 12 రోజులు ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. ఆ తర్వాత ఈ చిత్ర టీం సెకండ్ షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్లనుంది.
జూలై 20 వ తేదీ వరకూ హైదరాబాద్ లో షూటింగ్ చేసి, జూలై 21 నుంచి రాజస్థాన్ లో షూటింగ్ చేయనున్నారు. ఇప్పటికే రాజస్థాన్ లోని లొకేషన్స్ ని కూడా ఫైనలైజ్ చేసారు. ఇక్కడ సుమారు 20 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని సమాచారం. వరుణ్ తేజ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఇది కాకుండా రేనుద్ రోజుల క్రితమే
తన రెండవ సినిమా ‘కంచె’ సినిమా షూటింగ్ ఫినిష్ చేసాడు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.