లొకేషన్ల వేటలో వెంకీ – రామ్ చరణ్ ల చిత్రం

Published on Oct 10, 2013 9:30 pm IST

venkatesh-and-ram-charan-mo
విక్టరీ వెంకటేష్ మరియు రామ్ చరణ్ కలిసి నటించబోతున్న మల్టీ స్టారర్ సినిమా త్వరలో మొదలుకానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు మరియు లొకేషన్ల వేట కొనసాగుతుంది. వెంకటేష్ ఈ సినిమాలో చరణ్ కు అంకుల్ గా నటించనున్నాడు

ముందుగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు కృష్ణను ఎన్నుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ ప్రాజెక్ట్ లో నటించట్లేదని తెలిపింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను కృష్ణవంశీ తెరకెక్కించనున్నాడు.

బండ్ల గణేష్ ఈ మల్టీ స్టారర్ సినిమాకు నిర్మాత. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది

సంబంధిత సమాచారం :