లాక్ డౌన్ రివ్యూ: అసుర్ హిందీ వెబ్ సిరీస్(వూట్)

లాక్ డౌన్ రివ్యూ: అసుర్ హిందీ వెబ్ సిరీస్(వూట్)

Published on Jun 2, 2020 5:12 PM IST

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నెక్స్ట్ ఛాయిస్ గా హిందీ వెబ్ సిరీస్ అసుర్ ని తీసుకోవడం జరిగింది. క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన అసుర్ ఎలా ఉందొ సమీక్షంలో చూద్దాం..

కథాంశం ఏమిటీ?
ఓ నగరంలో వరుస హత్యలు జరుగుతాయి. ఫోరెన్సిక్ నిపుణుడు అయిన ధనంజయ్ రాజ్ ఫుత్(హర్షద్ వార్షి) ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. అనుకోకుండా ధనుంజయ్ మర్డర్ కేసులో ఇరుక్కొని జైలుపాలవుతాడు. అనంతరం ఈ హత్యల వెనుక ఎవరున్నారు అని తెలుసుకోవడానికి నిఖిల్ నైర్(బరున్ సొబ్టి) రంగంలోకి దిగుతాడు. మరి ఈ సీరియల్ మర్డర్స్ వెనుక ఉన్న రహస్యం ఏమిటీ? దానిని వారు ఎలా ఛేదించారు అనేది మిగతా కధాంశం.

ఏమిబాగుంది?
క్రైమ్, మైథాలజీ మరియు సస్పెన్సు కలిగిన సిరీస్ ఉత్కంఠగా సాగుతుంది. సాధారణంగా హిందీ సినిమాలలో కామెడీ రోల్స్ చేసే హర్షద్ వార్షి, ఓ సీరియస్ ఇంటెన్స్ పాత్రలో అద్భుతంగా నటించాడు. పోలీస్ పాత్రలో బరున్ సొబ్తి సైతం మంచి నటనతో మెప్పించారు.

ప్రతి ఎపిసోడ్ లో కట్టిపడేసే సస్పెన్సు, ఉత్కంఠతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. క్రైమ్ సన్నివేశాలు, నేపథ్యం బాగా కుదిరాయి.

ఏమి బాగోలేదు
సి ఐ డి, క్రైమ్ పెట్రోల్ వంటి ఫేమస్ క్రైమ్ సీరియల్స్ నుండి స్ఫూర్తి పొందారు అన్న భావన కలుగుతుంది. కంటెంట్ పరంగా కేవలం అడల్ట్ కోసం ఉద్దేశించి కావడంతో పాటు, ఒక వర్గం ప్రేక్షకులు ఇష్టపడక పోవచ్చు.

చివరి మాటగా
మొత్తంగా చెప్పాలంటే అసుర్ ఆద్యంతం ఆసక్తిగా సాగే అద్భుతమైన క్రైమ్ అండ్ సన్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హారర్
అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది మంచి అనుభూతిని పంచుతుంది. లాక్ డౌన్ లో మంచి ఛాయిస్ గా అసుర్ ని చెప్పుకోవచ్చు.

Rating: 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు