లాక్ డౌన్ రివ్యూ: భేతాళ్ హిందీ వెబ్ సిరీస్ (నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ: భేతాళ్ హిందీ వెబ్ సిరీస్ (నెట్ ఫ్లిక్స్)

Published on May 30, 2020 3:43 PM IST

నటీనటులు: వినీత్ కుమార్ సింగ్, అహనా కుమ్రా

దర్శకత్వం: పాట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్

నిర్మాత (లు): గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ

సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ ఆచారీ, తనయ్ సతం

 

మన లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నేడు హిందీ వెబ్ సిరీస్ భేతాళ్ ని ఎంచుకోవడం జరిగింది. జొంబీ హార్రర్ సిరీస్ గా వచ్చిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండగా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

స్వార్థపరుడైన ఓ బడా కాంట్రాక్టర్ ఓ మారుమూల ప్రాంతంలోని పాడుబడ్డ టన్నెల్ ని ఓపెన్ చేసి రోడ్డు నిర్మించాలని అనుకుంటాడు. ఐతే అది శపించబడ్డ ప్రాంతం దానిజోలికి వెళితే నాశనం తప్పదు అని అక్కడి స్థానికులు హెచ్చరిస్తారు. మొండివాడైన కాంట్రాక్టర్ ఎలాగైనా ఆ టన్నెల్ ఓపెన్ చేయాలని ఓ ప్రైవేట్ ఫోర్స్ సాయం తీసుకుంటాడు, ఐతే అక్కడ ఉన్న దుష్ట శక్తుల నుండి ఈ సైన్యానికి ప్రతి ఘటన ఎదురవుతుంది. ఆ టన్నెల్ ఓ దుష్ట శక్తి పెద్ద జొంబీ సైన్యాన్ని సిద్ధం చేసుకొని ఉంటాడు. అతేంద్రియ శక్తులతో పోరాడి ఆ సైన్యం టన్నెల్ ఓపెన్ చేశారా లేదా అనేది మిగతా కథ

 

ఏమి బాగుంది?

ప్రధాన పాత్ర చేసిన అహనా కుమ్ర నటన మెప్పిస్తుంది. స్పెషల్ టీమ్ లో సభ్యురాలిగా ఆమె వీరోచిత నటన మెప్పిస్తుంది. చాలా కాలం తరువాత ఓ సాలిడ్ రోల్ దక్కించుకున్న సుచిత్ర పిళ్ళై మంచి నటన కనబరిచింది. నిర్మానుష్యమైన ప్రాంతం, అక్కడ హార్రర్ సెటప్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రెమ్ చాలా రిచ్ మరియు ఆకర్షణీయంగా ఉంది. సౌండ్ డిజైన్ మరియు బీజీఎమ్ ఆకట్టుకొనే అంశాలు. ప్రధాన పాత్రలు చేసిన వారి నటన కథలో సహజంగా సాగుతుంది. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది.

 

ఏమి బాగోలేదు?

భేతాళ్ ట్రైలర్ చూసిన తరువాత ఓ మంచి జొంబీ హారర్ చూడబోతున్నాం అన్న ఆలోచన కల్గుతుంది. అలాగే ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సిరీస్ పై అంచలనాలు పెంచేదిగా ఉంటుంది. ఐతే నెక్స్ట్ ఎపిసోడ్ నుండి కథ మరియు కథనం పట్టుకోల్పోయాయి. క్రియేటివిటీ పేరుతో అస్సలు లాజిక్ ఫాలో కాలేదు. ఓ హారర్ సిరీస్ కి కావలసిన ఉత్కంఠ, భయం భేతాళ కలిగించ లేకపోయింది. నెమ్మదిగా సాగే కథనం ఇబ్బంది పెట్టిన మరో అంశం.

 

చివరి మాటగా

మొత్తంగా చెప్పాలంటే జొంబీ హారర్ సిరీస్ గా వచ్చిన భేతాళ్ చక్కని ప్రారంభం దక్కించుకున్నప్పటికీ ఆ మజా చివరి వరకు కొనసాగించలేక పోయింది. సెకండ్ ఎపిసోడ్స్ నుండే భేతాళ్ సాగదీత ధోరణిలో సాగుతుంది. జొంబి హారర్ చిత్రాలు ఇష్టపడే వారు ఓ సారి చూడవచ్చు, కానీ గత చిత్రాల మాదిరి ఒళ్ళు గగ్గుర్ గొలిపే సన్నివేశాలు మాత్రం ఆశించకూడదు.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు