లాక్ డౌన్ రివ్యూ: ఘోమ్ కేతు హిందీ మూవీ (జీ5)

లాక్ డౌన్ రివ్యూ: ఘోమ్ కేతు హిందీ మూవీ (జీ5)

Published on Jun 3, 2020 4:43 PM IST

నటీనటులు: నవాజుద్దీన్ సిద్దిఖీ, రాగిణి ఖన్నా, అనురాగ్ కశ్యప్, రజాక్ ఖాన్, రఘువీర్ సింగ్..
దర్శకుడు: పుష్పేంద్ర నాథ్ మిశ్రా

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో మన నెక్స్ట్ ఛాయిస్ హిందీ ఫిల్మ్ ఘోమ్ కేతు. థియేటర్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ గా ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

కథాంశం ఏమిటి?
ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఘోమ్ కేతు(నవాజుద్దీన్ సిద్దిఖీ) బాలీవుడ్ లో పెద్ద రైటర్ గా ఎదగాలని ముంబైకి పారిపోతాడు. ఐతే అక్కడ రచయితగా అవకాశాలు రాక విసిగిపోతాడు. ఇక ఘోమ్ కేతు 30రోజులలో ఎలాగైనా సాధించి తీరాలని ఓ టార్గెట్ పెట్టుకొని సీరియస్ గా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఘోమ్ కేతు తల్లిదండ్రులు ఎలాగైనా అతన్ని వెతికి పట్టుకురామని బద్లాని(అనురాగ్ కశ్యప్) అనే పోలీస్ కి బాధ్యత అప్పగిస్తారు. మరి ఘోమ్ కేతు రచయితగా ఎదిగాడా? ఓడిపోయి ఇంటికి చేరాడా? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే…

ఏమి బాగుంది?
ఈ సినిమా కొరకు తీసుకున్న నటీనటులు అద్భుతం . నిర్మాత అనురాగ్ కశ్యప్ పరిశ్రమలోని మంచి నటులను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. ఇక రచయితగా ఎదగాలనుకునే ఓ పల్లెటూరి ఇన్నోసెంట్ వ్యక్తిగా నవాజుద్దీన్ అద్భుతం అనాలి. ఆయన యూపీ విలేజ్ యాక్సన్ట్ ఆకట్టుకుంది.

నవాజుద్దీన్ తండ్రి పాత్ర చేసిన రఘువీర్ యాదవ్ తెరపై నవ్వులు పూయించారు. ఆయన పాత్ర సినిమాకు ఓ ఆకర్షణ. బాలీవుడ్ లో సెలబ్రిటీలుగా ఎదగాలనుకునే వారి కలల ప్రయాణం చక్కగా చూపించారు. ఈ కథలో హాస్యం చక్కగా కుదిరింది. క్లైమాక్స్ ట్విస్ట్స్, బీజీఎమ్ ఆకట్టుకున్నాయి.

ఏమి బాగోలేదు?
గతంలో అనేక సినిమాలలో ఇలాంటి నేపథ్యం ఉండడం వలన కొత్త మూవీ చూస్తున్న భావన రాదు. అద్భుతమైన ఆరంభం మరియు క్లైమాక్స్ మినహా మధ్యలో మూవీ స్లోగా సాగుతుంది.

చివరి మాటగా
కొత్తదనం లేని కథ అయినప్పటికీ నవాజుద్దీన్ మరియు ఇతర నటీనటుల అద్భుత నటన, క్లైమాక్స్ ట్విస్ట్, హ్యూమర్ ఆకట్టుకుంటాయి. లాక్ డౌన్ సమయంలో ఈ మూవీ చూడవచ్చు.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు