లాక్ డౌన్ రివ్యూ: హస్ముఖ్ హిందీ వెబ్ సిరీస్(నెట్ ఫ్లిక్స్)

నటీనటులు: వీర్ దాస్, రణవీర్ షోరే, మనోజ్ పహ్వా

దర్శకత్వం: నిఖిల్ గోన్సాల్వ్స్

నిర్మాత (లు): మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ, వీర్ దాస్, సమీర్ నాయర్

సినిమాటోగ్రఫీ: ఆకాష్ అగర్వాల్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నెక్స్ట్ ఛాయిస్ హిందీ వెబ్ సిరీస్ హస్ముఖ్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ని నిఖిల్ గోన్సాల్వ్స్ తెరకెక్కించగా నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

ప్రముఖ స్టాండప్ కమెడియన్ గులాటి(మనోజ్ పహ్వ) దగ్గర అసిస్టెంట్ గా చేరుతాడుహస్ముఖ్(వీర్ దాస్). స్టేజ్ పై తన ప్రదర్శనకు అవకాశం ఇవ్వలేదన్న కోపంతో హస్ముఖ్ తన గురువు గులాటిని చెంపేస్తాడు. ఐతే స్టాండప్ కమెడియన్ గా హస్ముఖ్ సక్సెస్ కాలేక పోతాడు. కాగా గులాటి మేనేజర్ జిమ్మీ(రణ్వీర్ షోరేయ్) సలహా మేరకు షోలో కామెడీ పండించాలంటే ఒకరిని చంపితే ప్రేరణ వస్తుందన్న సూత్రాన్ని ఫాలో అవుతాడు. ఒక ప్రక్క స్టేజ్ పై నవ్వులు కురిపిస్తూ మరో ప్రక్క కిల్లర్ గా మారిన హస్ముఖ్ కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ.

 

ఏమి బాగుంది?

ఆసక్తికర నేరపూరిత సన్నివేశాలతో సాగే హస్ముఖ్ సిరీస్ ప్లాట్ ఆకట్టుకుంటుంది. ప్రధాన పాత్రలు చేసిన వీర్ దాస్ స్టాండప్ కమెడియన్ గా సీరియల్ కిల్లర్ గా రెండు విరుద్ధ స్వభావాలు కలిగిన పాత్రలో మెప్పించారు. ఐతే సిరీస్ లో అందరినీ ఆకర్శించే పాత్ర గులాటీ. వీర్ దాస్ కి గైడ్ గా ఉండే పాత్రలో రణ్వీర్ షోరేయ్ ప్రేక్షకులను తనపువైపు తిప్పుకున్నారు. ఆయన నటన మరియు డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. డైలాగ్స్ ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.

 

ఏమి బాగోలేదు?

అద్భుతమైన ప్రారంభం కలిగిన ఈ సిరీస్ ఎపిసోడ్స్ గడిచే కొద్దీ పట్టుకోల్పోయింది. ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ పరిచయమయ్యే కొత్త పాత్రలు ఆకర్షణ కాకపోగా భారంగా తయారయ్యాయి. అక్కడ క్రైమ్ నేపథ్యంతో సంబంధం లేని కొన్ని పాత్రలు విసుగుపుట్టిస్తాయి.

ఒక క్రైమ్ థ్రిల్లర్ కి వేగంగా సాగే స్క్రీన్ ప్లే తక్కువ నిడివి ఆకర్షణ ఇస్తాయి. కానీ ఈ సిరీస్ లో ఓ చిన్న పాయింట్ ని పది ఎపిసోడ్స్ వరకు సాగదీసిన భావన కలుగుతుంది. ఒక దశ దాటిన తరువాత ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ తేలిపోయాయి.

 

చివరిమాటగా

అద్భుతమైన ఆరంభం, ప్రధాన పాత్రల ఆకట్టుకొనే నటన, కొన్ని క్రైమ్ సన్నివేశాలతో పాటు, కామెడీ యాంగిల్ ఆకట్టుకుంటుంది. ఐతే ఎపిసోడ్స్ గడిచే కొద్దీ సిరీస్ పట్టుకోల్పోయింది. లాజిక్ లేకుండా సాగే సన్నివేశాలు మరియు నిరాశక్తిగా సాగే కథనం సిరీస్ పై ఆసక్తి కోల్పోయేలా చేశాయి.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం :

More