లాక్ డౌన్ రివ్యూ : ఇండియన్ మ్యాచ్ మేకింగ్ -రియాలిటీ షో (నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ : ఇండియన్ మ్యాచ్ మేకింగ్ -రియాలిటీ షో (నెట్ ఫ్లిక్స్)

Published on Jul 24, 2020 5:33 PM IST

తారాగణం: వైసర్, అపర్ణ, అంకిత, నాడియా, జే, అక్షయ్ మరియు ప్రధానమన్
దర్శకత్వం: స్మృతి ముంధ్రా

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న రియాలిటీ షో ఇండియన్ మ్యాచ్ మేకింగ్ ని ఎంచుకోవడం జరిగింది. ఆ రియాలిటీ షో ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

దేని గురించి?

ముంబైకి చెందిన సీమా టపారియా ఇండియా మరియు విదేశాలలో పెళ్లి సంబంధాలు కుదురుస్తూ ఉంటారు. ముంబైకి చెందిన ఇద్దరు పెళ్లికాని అబ్బాయిల(అక్షయ్, ప్రద్యుమ్న్) కి ఇండియన్ అమెరికన్ అమ్మాయిలు అయిన (వైసర్, అపర్ణ, అంకిత, నదియా మరియు జే) లకు పెద్దల కుదిర్చిన పెళ్లి నిశ్చయించాలని పూనుకుంటుంది. మరి ఆ ఇద్దరు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిల మధ్య జరిగిన పెళ్లి చూపులు, మీటింగ్స్ గురించిన షోనే ఈ ఇండియన్ మ్యాచ్ మేకింగ్.

ఏమి బాగుంది?
ఇప్పటి జనరేషన్ లో అరేంజ్డ్ మ్యారేజ్ అనేది కొత్తగా అనిపించే అంశం. కానీ భారతీయ సాంప్రదాయంలో ఇది ప్రధానమైన అంశం. పార్టిసిపెంట్స్ మధ్య డిస్కషన్స్,సంభాషణలు ఆసక్తికరంగా సాగాయి. ఇక ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ఇండియన్ ఫ్యామిలీస్ వాళ్ళ కల్చర్స్ చూపించిన విధానం బాగుంది.

ముంబైలోని వ్యాపార కుటుంబానికి చెందిన అక్షయ్ షో లో బాగా ఎంటర్టైన్ చేశాడు. అమ్మ చాటు కొడుకుగా అతని ప్రవర్తన బాగుంది. ఇక హెడ్ స్ట్రాంగ్ గర్ల్ అపర్ణకు మ్యాచ్ సెట్ చేయడానికి సీమా చాలా కష్టపడ్డారు.

మోడరన్ సొసైటీ లలోని కుటుంబాలను వారి అభిరుచులను పరిగణలోకి తీసుకొని, అన్ని కోణాలు చర్చించే విధంగా పార్టిసిపెంట్స్ ని ఎంచుకున్నారు. వివిధ నేపధ్యాలకు చెందిన పార్టిసిపెంట్స్ తో సాగిన ఈ రియాలిటీ షో ఆసక్తిగా సాగింది.

ఏమి బాగోలేదు?
పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అనే కాన్సెప్ట్ తో సాగే ఈ రియాలిటీ షో కొన్ని చోట్ల, డైవర్ట్ అయినట్లు అనిపిస్తుంది. పెళ్లి చేసుకోమని పేరెంట్స్ బలవంతం పెట్టడం, అక్షయ్ కుమార్ తల్లి అన్ని ఆమె అనుకున్నట్లు జరగాలనుకే తత్త్వం వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నాయి.

ఇక కొన్ని ఎపిసోడ్స్ లో నాటకీయత ఎక్కువైయింది. పెళ్లి కోసం అమ్మాయిల లైఫ్ స్టైల్, మార్చుకోవాలనే ధోరణి ఈ తరం అమ్మాయిలకు నచ్చక పోవచ్చు.

చివరి మాటగా

అరేంజ్డ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ రియాలిటీ షో ఓ సంబంధ కుదర్చడానికి జరిగే తంతు, అమ్మాయి, అబ్బాయిల అభిప్రాయాలు మరియు జాతులు, కులాలు, సంస్కృతులు ఇలా అనేక విషయాలను చర్చిస్తూ ఆసక్తిగా సాగింది. కొన్ని ఎపిసోడ్స్ లో నాటకీయత ఎక్కువైనా మొత్తంగా ఆకట్టుకుంటుంది.

Rating: 3.25/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు