లాక్ డౌన్ రివ్యూ : ఈట్ హాపెండ్ ఇన్ కోల్‌కతా (‘ఆల్ట్‌బాలాజీ’లో ప్రసారం)

తారాగణం: నగ్మా రిజ్వాన్, కరణ్ కుంద్రా తదితరులు

రచన: కెన్ ఘోష్

సంగీతం : హర్షవర్ధన్ దీక్షిత్

దర్శకత్వం:  కెన్ ఘోష్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సిరిస్ ‘ఈట్ హాపెండ్ ఇన్ కోల్‌కతా ‘. కెన్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ‘ఆల్ట్‌బాలాజీ’లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరిస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

ఈ సిరీస్ 1962 సంవత్సరంలో కలకత్తా నేపథ్యంలో జరుగుతుంది. కుసుమ్ గంగూలీ (నగ్మా రిజ్వాన్) ఒక ప్రసిద్ధ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అవుతుంది. మరోవైపు, రోనో బీర్ ఛటర్జీ ( కరణ్ కుంద్రా ) ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు, కానీ కుసుమ్ గంగూలీ అతన్ని తిరస్కరిస్తుంది. ఆ తరువాత జరిగిన జరిగిన కొని సంఘటనల అనంతరం కుసుమ్ గంగూలీ, రోనో బీర్ తో ప్రేమలో పడుతుంది. అయితే రోనో బీర్ ఆమెను మోసం చేసి, ఆమెను బాధ పెడతాడు. ఆ తరువాత 1971లో ఇండో -పాక్ నేపథ్యంలో ఇద్దరూ మరోసారి కలవాల్సి వస్తోంది. ఈ సమస్యాత్మక సమయంలో ఈ జంట తమ ప్రేమను ఎలా తిరిగి పొందింది అనేదే మిగిలిన కథ.

 

ఏం బాగుంది :

ఈ సిరీస్ లో కరణ్ కుంద్రా ప్రధాననమైన పాత్రను పోషించాడు. ఘనమైన పనితనం కనబర్చాడు. అతని లుక్, పెర్ఫార్మెన్స్ మరియు డైలాగ్ డెలివరీ అద్భుతంగా అనిపిస్తాయి. అతని టాలెంట్ ఈ సిరీస్ పై పూజ్యమైన ప్రభావాన్ని కలిగించింది. ఇక కుసుమ్ పాత్రలో అరంగేట్రం చేసిన నగ్మా రిజ్వాన్ కూడా బాగా నటించింది. ఆమె మొత్తం ప్రదర్శన పైనే ఈ సిరీస్ ఆధారపడింది అందుకు తగ్గట్లుగానే తన పాత్రలో ఆమె బాగా చేసింది. ప్రేమకథ ఉంచిన ప్రాథమిక అమరిక మనోహరంగా అనిపిస్తుంది. నటీనటుల ప్రదర్శనతో పాటు అందమైన విజువల్స్ , నిర్మాణ విలువలు మరియు కెమెరా పనితనం చాలా బాగున్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ ప్రారంభ భాగంలోని కొన్ని కాలేజీ ఎపిసోడ్‌లు చాలా చక్కగా రూపొందించబడ్డాయి.

 

ఏం బాగాలేదు :

ఈ ప్రదర్శన 1969 నటి కాలంలో ఉంది, కానీ మేకర్స్ చాలా సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకున్నారు. అప్పటి పరిస్థితులను ఫాలో అవకపోవడం, సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటం మరియు అనేక ఇతర సమస్యలు ఉన్నాయి, అవన్నీ అప్పటి సంస్కృతిలో ఏమాత్రం లేవు. సీన్స్ ను ఆకర్షణీయంగా మలచడానికి, మేకర్స్ కమర్షియల్ హంగులు జోడించారు, పైగా కథ కూడా చాలా రొటీన్ గా ఉంది.

 

చివరి మాటగా :

మొత్తంమీద, కలకత్తా నేపథ్యంలో వచ్చిన ఈ ‘ఈట్ హాపెండ్ ఇన్ కోల్‌కతా’ సిరీస్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. అయితే బ్యాక్‌డ్రాప్ తో పాటు కథ కూడా పాతదే కావడం మైనస్. కథనం కూడా వాస్తవికంగా ఉండదు. కానీ వినోదాత్మకంగా సాగుతూ కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. మీరు పీరియాడిక్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారైతే, ఈ సిరీస్ చూడొచ్చు. అంతకు మించి ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పటానికి ఏమీ లేదు.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం :

More