లాక్ డౌన్ రివ్యూస్: కామ్యాబ్ హిందీ మూవీ(నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూస్: కామ్యాబ్ హిందీ మూవీ(నెట్ ఫ్లిక్స్)

Published on May 7, 2020 11:02 AM IST

నటులు : సంజయ్ మిశ్రా, దీపక్ డోబ్రియాల్
దర్శకత్వం : హార్దిక్ మెహతా
నిర్మాత : గౌరీ ఖాన్, మనీష్ ముంద్రా, గౌరవ్ వర్మ
సంగీతం : రచితా అరోరా
సినిమాటోగ్రఫీ : పియూష్ పుటీ

మన లాక్ డౌన్ రివ్యూస్ లో నెక్స్ట్ మూవీ కామ్యాబ్. సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ కామెడీ అండ్ ఎమోషన్ ఎంటర్టైనర్ ని హీరో షారుక్ ఖాన్ నిర్మించారు.

 

కథాంశం ఏమిటీ?

సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గా 499 సినిమాలలో గుర్తింపు లేని పాత్రలు చేసిన సుధీర్(సంజయ్ మిశ్రా) సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి పరిశ్రమకు దూరంగా జీవితం గడుపుతూ ఉంటాడు. సుధీర్ ని ఓ మిత్రుడు మరో సినిమా చేశావంటే 500ల సినిమాలు పూర్తి అవుతాయి..నీ పేరున ఓ రికార్డు ఏర్పడుతుందని ప్రోత్సహిస్తాడు. అది సీరియస్ గా తీసుకున్న సుధీర్ వృద్ధాప్యంలో సినిమా అవకాశాల కోసం బయలుదేరుతాడు. మరి సుధీర్ ప్రస్తుత పోటీ పరిశ్రమలో అవకాశం దక్కించుకున్నాడా? తన 500వ చిత్రంలో నటించి రికార్డు పూర్తి చేశాడా? అనేది మిగతా కథ

 

ఏమి బాగుంది?

 

దర్శకుడు హార్దిక్ మెహతా ఎంచుకున్న కథ అసాధారణమైనది. అలాగే ఏళ్ల తరబడి పరిశ్రమలో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ జీవితాలు, వారికిచ్చే గౌరవం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆయన చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. వయసుడికిన సీనియర్ జూనియర్ ఆర్టిస్టుగా సంజయ్ మిశ్రా నటన అద్భుతంగా ఉంది. ఆ పాత్రకు ఆయన నటన చాల సహజంగా అనిపించింది. హ్యూమర్ మరియు ఎమోషన్స్ బ్లెండ్ చేసి తెరకెక్కించిన కామ్యాబ్ చాల బాగుంది.

 

ఏమి బాగోలేదు?

 

అన్ని రకాల కమర్షియల్ అంశాలు లేకపోవడం ఒక చిన్న మైనస్. అలాగే క్లైమాక్స్ ఇంకొంచెం ఎమోషన్స్ దట్టించి తీయాల్సింది, ఆ పరిధి, అవకాశం ఉన్నా హడావుడిగా ముగించిన భావన కలిగింది.

 

చివరి మాటగా

 

సినిమాల్లో తెరపై కనిపిస్తున్నా సమాజంలో తెరవెనుకే ఉండే జూనియర్ ఆర్టిస్ట్స్ జీవితాలను ఎమోషన్స్ మరియు హ్యూమర్ జోడించి తెరకెక్కించిన కామ్యాబ్ మంచి చిత్రం. ఈ లాక్ డౌన్ సమయంలో మంచి ఛాయిస్ గా కామ్యాబ్ సినిమాను చెప్పుకోవచ్చు.

123telugu.com Rating : 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు