లాక్ డౌన్ రివ్యూ : నెవర్ హావ్ ఐ ఎవర్ ఇంగ్లీష్ సిరీస్(నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ : నెవర్ హావ్ ఐ ఎవర్ ఇంగ్లీష్ సిరీస్(నెట్ ఫ్లిక్స్)

Published on May 6, 2020 1:56 PM IST

నటీనటులు : మైత్రేయి రామకృష్ణన్, పూర్ణ జగన్నాథన్, రిచా మూర్జని, రామోనా యంగ్, లీ రోడ్రిగెజ్, డారెన్ బార్నెట్, జారెన్ లెవిసన్, జాన్ మెక్‌ఎన్రో

క్రియేటెడ్ : మిండీ కాలింగ్ మరియు లాంగ్ ఫిషర్

మన లాక్ డౌన్ సిరీస్ లో నెక్స్ట్ సిరీస్ నెవర్ హావ్ ఐ ఎవర్. నెట్ ఫ్లిక్స్ నందు అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో చుద్దాం…

దేవి విశ్వకుమార్ (మైత్రేయి రామకృష్ణన్) అనే అమెరికాలో జన్మించిన భారతీయ టీనేజ్ అమ్మాయి తన తండ్రి మరణించిన తరువాత ఆమె తల్లి నలిని విశ్వకుమార్ (పూర్ణ జగన్నాథన్) మరియు కజిన్ కమలా (రిచా మూర్జని) తో నివసిస్తుంది. ఆమె తండ్రి మరణం దేవిని కృంగదీస్తుంది దీనితో ఆమె ఎనిమిది నెలలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ బాధనుండి బయటపడిన దేవి తను కోల్పోయిన జీవితం మళ్ళీ పొందాలి అనుకుంటుంది. దాని కోసం ఓ మంచి లైఫ్ అలాగే బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కునే పనిలో ఉంటుంది. దీని కోసం తన బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఎలియనోర్ (రామోనా యంగ్) మరియు ఫాబియోలా (లీ రోడ్రిగెజ్) లతో కలిసి ప్లాన్స్ వేస్తుంది. దేవి పాక్స్టన్ హాల్-యోషిడా (డారెన్ బార్నెట్)ని ప్రేమిస్తుంది, అదే సమయంలో ఆమె తన శత్రువుగా భావించే బెన్ గ్రాస్ (జారెన్ లెవిసన్) పై కూడా పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈ నాటకీయ పరిణామాల మధ్య దేవి తల్లి తనకు తెలియకుండా ఎదో రహస్యం దాచి ఉంచిందని తెలుసుకుంటుంది. దేవికి తెలియకుండా ఆమె తల్లి నళిని విశ్వకుమార్ దాచిన ఆ రహస్యం ఏమిటీ? అనేది మిగతా కథ…

 

ఏమి బాగుంది?

రైటర్ మిండీ కాలింగ్ యంగ్ టీనేజ్ గర్ల్స్ ఆలోచనా విధానం, విషయాల పట్ల వారు స్పందిచే తీరు చక్కగా వివరించారు. అలాగే ఒక్క అమెరికన్ గర్ల్స్ మెంటాలిటీనే కాకుండా అందరీ అమ్మాయిల టీనేజ్ బిహేవియర్ థాట్స్ రిప్రెజెంట్ చేసేలా దేవి పాత్ర ఉంటుంది.

ఇక డిఫరెంట్ నేషనాలిటీ కలిగిన యూత్ రోల్స్ ని బ్లెండ్ చేసి కథలో ఇన్వాల్వ్ చేస్తూ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రధాన పాత్ర చేసిన దేవి మరియు ఫ్రెండ్స్ అలాగే కుటుంబ సభ్యుల పాత్రలు చేసిన నటులు కథలో చాల సహజంగా అనిపిస్తారు. ఇక హ్యూమర్ ఈ టెలివిజన్ సిరీస్ ప్రధాన బలం.

 

ఏమి బాగోలేదు?

ఈ టెలివిషన్ సిరీస్ లో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ ఏమి లేవు. కాకపోతే కేవలం యంగ్ జెనెరేషన్స్ ని ఉద్దేశించి తెరకెక్కించింది ఈ సిరీస్.

 

చివరి మాటగా

కాంటెంపరరీ సోషల్ లివింగ్, జనెరేషన్స్ ఆలోచనా విధానాలను తెలియజేస్తూ హ్యూమరస్ గా సాగే నెవెర్ హావ్ ఐ ఎవర్ ఓ మంచి సిరీస్. టీనేజ్ నుండి మిడిల్ ఏజ్ వరకు వివిధ దశలలో ఆడవాళ్ళ ఆలోచనా విధానం ఎలా ఉంటుంది అనేది ప్రముఖంగా ప్రస్తావించిన ఈ సిరీస్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది.

123telugu.com Rating : 4/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు