లాక్ డౌన్ రివ్యూ : రిజెక్ట్ఎక్స్ ( జీ5లో ప్రసారం)

లాక్ డౌన్ రివ్యూ : రిజెక్ట్ఎక్స్ ( జీ5లో ప్రసారం)

Published on Jun 1, 2020 4:54 PM IST


తారాగణం: సుమీత్ వ్యాస్, ఇషా గుప్తా

రచన: గోల్డీ బెహల్

దర్శకత్వం: గోల్డీ బెహల్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సిరిస్ ‘రిజెక్ట్ఎక్స్’. గోల్డీ బెహల్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరిస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

రిజెక్ట్ఎక్స్ అనేది సింగపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న ధనవంతులైన పిల్లలకు సంబంధించిన కథ. మొదటి సీజన్ లో ఒక విద్యార్థి అనుష్క (కుబ్రాసైత్) చంపబడిన సస్పెన్స్ తో ముగిసిన తరువాత, రెండవ సీజన్ ఇతర విద్యార్థులలో ఒకరైన ఆరవ్ (అహ్మద్ మాసి వాలీ) తన తండ్రిని చంపడానికి ప్రయత్నించడంతో ప్రారంభమవుతుంది. అతను కొత్త సెమిస్టర్ కోసం పాఠశాలకు తిరిగి వస్తాడు. మరియు కియారా (అనిషా విక్టర్)తో ప్రేమలో పడతాడు. వీటన్నిటిలోనూ, అనుష్క మరణంపై దర్యాప్తు చేయడానికి ఆఫీసర్ రెనే (ఇషా గుప్తా) వస్తోంది. ఇంతకీ కిల్లర్ ఎవరు? అసలు ఆ ధనిక విద్యార్థుల మధ్య జరిగింది ఏమిటి? అనేదే మిగిలిన కథ.

ఏం బాగుంది :

ఈషా గుప్తా గ్లామరస్ కాప్ పాత్రను బాగా పోషించింది. ఈ సిరీస్ చాలా స్కిన్ షో మరియు రొమాన్స్ తోనే నిండి ఉంది, యువ తరం ఇష్టపడే అంశాలు చాల ఉన్నాయి. ఇక హత్యకి సంబంధించిన సీన్స్ కూడా బాగున్నాయి. మరియు సస్పెన్స్ చివరి ఎపిసోడ్ ద్వారా ముగిసిన విధానం రెండవ సీజన్ లో బాగా సెట్ చేయబడింది. హిమాన్షు దుబే ఛాయాగ్రహణం కొన్ని గొప్ప విజువల్స్ అదించింది. అర్జున్ శ్రీవాస్తవ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఈషా గుప్తా ప్రవేశంతో ప్రారంభ ఎపిసోడ్లు మరియు ఆమె ధనిక పిల్లలతో వ్యవహరించడం కూడా బాగా బాగుంది.

ఏం బాగాలేదు :

రెండవ సీజన్ యొక్క రచన చాలా బలహీనంగా ఉంది. సస్పెన్స్ కోసమే వ్రాసిన చాలా సన్నివేశాలు బాగాలేదు. మరియు దానిలో ఒక ఇంట్రస్ట్ లేదు. ఈషా గుప్తా పాత్ర కూడా కొంచెం బెటర్ గా వుంటే బాగుండేది. పైగా ఈ సిరీస్ లో డ్రామా గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు.

ఈ ధారావాహికలో పాటలు కూడా ఉన్నాయి. ప్రదర్శన నుండి ఒక్క పాట కూడా క్లిక్ చేయదు. ప్రముఖ దర్శకుడు గోల్డీ భెల్ మెదటి సీజన్ లో చేసిన తప్పును సెకెండ్ సీజన్ లో కూడా ఆయన తన తప్పును సరిదిద్దుకోలేదు. అయినా సీక్వెల్ అవసరమయ్యే సారాంశం గాని మరియు ఆకర్షణ గాని ఈ సిరిస్ లో లేదు.

చివరి మాటగా :

మొత్తంమీద, రిజెక్ట్ఎక్స్ అనే హిందీ వెబ్ సిరీస్ లో సస్పెన్స్ లేకపోయినా మోతాదుకు మించి గ్లామర్ అండ్ రోమాన్స్ ను కలిగి ఉంది. మొదటి సీజన్ లాగే రెండవ సీజన్‌ కూడా గుడ్ కంటెంట్ తో రాలేదు. అయితే టీనేజ్ పాఠశాల వెళ్ళే పిల్లలు ఈ సిరీస్‌ను ఇష్టపడతారు, కాని డ్రామా మరియు ఎమోషన్స్ లేనందున ఇతరులకు బోరింగ్ వాచ్‌ గా ముగుస్తుంది.

Rating: 2/5

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు