లాక్ డౌన్ రివ్యూ : తాజ్ మహల్ 1989(నెట్ ఫ్లిక్స్)

నటీనటులు: నీరజ్ కబీ, గీతాంజలి కులకర్ణి, డానిష్ హుస్సేన్

దర్శకత్వం: పుష్పేంద్ర నాథ్ మిశ్రా

నిర్మాత : దివ్య అయ్యర్

సినిమాటోగ్రఫీ: విల్ హంఫ్రిస్

నేడు మన లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో తాజ్ మహల్ 1989 వెబ్ సిరీస్ ని తీసుకోవడం జరిగింది. దర్శకుడు పుష్పేంద్ర నాధ్ మెహతా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

 

కథాంశం ఏమిటీ?

ఈ వెబ్ సిరీస్ 1989 లో లక్నో విశ్వవిద్యాలయంలో జరిగిన కొన్ని ప్రేమ కథల సమాహారంగా సాగుతుంది. అక్తర్ (నీరజ్ కబీ) మరియు సరిత (గీతాంజలి కులకర్ణి) ప్రేమికులు కాగా వీరి ప్రేమలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మరోవైపు, అదే విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అయిన రష్మి (అన్షుల్ చౌహాన్), ధరమ్ (పరాస్ ప్రియదర్శన్) అంగద్ (అనుద్ సింగ్) మధ్య ఓ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఓ యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఈ ప్రేమకథల ముగింపు ఏమిటనేదే తాజ్ మహల్ 1989.

 

ఏమి బాగుంది?

అప్పటి పరిస్థితులు, కల్చర్, బ్యాగ్రౌండ్ సెట్ అప్ బాగుంది. ప్రేమికుల మధ్య ఓల్డ్ ఏజ్ రొమాన్స్ తెరకెక్కించిన విధానం బాగుంది. సరిత పాత్ర చేసిన గీతాంజలి నటన ఆకట్టుకుంది. భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె చక్కగా నటించారు. ప్రేమలో ఉన్న యంగ్ కపుల్ మానసిక భావాలు తెరకెక్కించిన తీరు బావుంది. పేమ సంఘర్షణల మధ్య పొలిటికల్ కోణం అలరిస్తుంది.

 

ఏమి బాగోలేదు?

తాజ్ మహల్ 1989 వెబ్ సిరీస్ నరేషన్ చాల స్లో గా సాగుతుంది. నిర్మాణ విలువలు పూర్ గా ఉన్నాయి. ఎడిటింగ్ అసలు ఆకట్టుకోదు. ఈ వెబ్ సిరీస్ లో కథకు అవసరం లేని అనేక సన్నివేశాలు కథనం నెమ్మదించేలా చేశాయి. ఇక బీజీఎమ్ కూడా ఏమంత ఆకర్షణీయంగా లేదు. ప్రేమికుల ఆలోచనా విధానం చాలా ఆధునికంగా ఉంటుంది, దానితో ఎప్పుడో జరిగిన పీరియడ్ లవ్ డ్రామా చూస్తున్నాం అన్న భావన రాదు.

 

చివరి మాటగా

మొత్తంగా చెప్పాలంటే తాజ్ మహల్ 1989 వెబ్ సిరీస్ లో కొన్ని ఆకట్టుకొనే అంశాలు ఉన్నప్పటికీ స్లోగా సాగే కథనం, ఉన్నతంగా లేని నిర్మాణ విలువలు కొంచెం ఇబ్బంది పెడతాయి. సహనం కలిగి ఓల్డ్ ఏజ్ లవ్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ నచ్చవచ్చు.

123telugu.com Rating : 2.5/5

సంబంధిత సమాచారం :

X
More