లాక్ డౌన్ రివ్యూ: ది లిఫ్ట్ బాయ్ (నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో మన నెక్స్ట్ మూవీ లిఫ్ట్ బాయ్. డైరెక్టర్ జోనథన్ తెరకెక్కించిన లిఫ్ట్ బాయ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

 

కథాంశం ఏమిటీ?

రాజు తవ్డే (మొయిన్ ఖాన్) ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్, ఎటువంటి లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. అతని తండ్రి ఉన్నత వర్గం వారు నివసించే అపార్ట్మెంట్లో లిఫ్ట్ మ్యాన్ గా పని చేస్తూ ఉంటాడు. ఒక రోజు రాజు తండ్రికి గుండెపోటుతో రావడంతో డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవాలని చెవుతారు. దీనితో లిఫ్ట్ బాయ్‌గా రాజు తన తండ్రి విధిని చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ రాజుకి మౌరీన్ జౌసా (నైలా మసూద్) అనే ఓ రిచ్ ఓల్డ్ లేడీ తో స్నేహం ఏర్పడుతుంది. ఆ తరువాత రాజు జీవితంలో ఏర్పడిన పరిణామాలు ఏమిటనేది మిగతా కథ

 

ఏమి బాగుంది?

ఇష్టం లేని పనిని చేయలేక ఇబ్బందిపడే మధ్య తరగతి కుర్రాడిగా మోయిన్ ఖాన్ నటన చాల సహజంగా ఉంది. రిచ్ క్లాస్ మనుషుల మధ్య ఇబ్బంది పడుతూ పనిచేసే పేద కుర్రాడిగా బాగా నటించారు. మొయిన్ ఖాన్ తో స్నేహం చేసే రిచ్ ఓల్డ్ లేడీ పాత్ర చేసిన నైలా మసూద్ చాల బాగా చేశారు. కథను లిఫ్ట్ సన్నివేశాలతో మిళితం చేసి నడిపించిన తీరు బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్ బాగుంది.

 

ఏమి బాగోలేదు?

స్లోగా సాగే సీరియస్ కథనం ఆకట్టుకోవు. ఓ రిచ్ లేడీ లిఫ్ట్ బాయ్ తో స్నేహం చేయడం అనేది వాస్తవానికి చాల దూరంగా ఉంది. అలాగే ఆ రెండు పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా అంతగా ఆకట్టుకోదు. కేవలం క్లైమాక్స్ మాత్రమే కొంచెం ఆకట్టుకుంది.

 

చివరి మాటగా:

మొత్తంమీద, ది లిఫ్ట్ బాయ్ కొన్ని మనసుకు నచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అక్కడక్కగా హ్యూమర్ తో సాగుతుంది.సింపుల్ మరియు నీట్ నెరేషన్ బాగుంది. ఐతే స్లోగా సాగే కథనం, ఎమోషన్స్ పండకపోవడం ఒకింత మైనస్ అని చెప్పొచ్చు.

123telugu.com Rating : 3/5

సంబంధిత సమాచారం :

X
More