లాక్ డౌన్ రివ్యూ : ‘ది లవ్ బర్డ్స్’ (నెట్‌ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ : ‘ది లవ్ బర్డ్స్’ (నెట్‌ఫ్లిక్స్)

Published on May 25, 2020 1:53 PM IST

నటీనటులు: ఇస్సా రెయ్, కుమాయిల్‌ నాజియాని, పాల్ స్పార్క్స్ తదితరులు

దర్శకత్వం: మైకేల్ షోవాల్టర్

నిర్మాతలు : టొం లసాలీ, ఓలివర్ ఓబిస్ట్, మార్టిన్ గెరొ, టొద్ద్ షుల్మన్, జోర్డానా మొల్లిక్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సినిమా ‘ది లవ్ బర్డ్స్’. మైకేల్ షోవాల్టర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

 

ఈ లవ్ బర్డ్స్ చిత్రం విడిపోయే ఆలోచనలో ఉన్న జంట లీలాని (ఇస్సా రెయ్) మరియు జిబ్రాన్ ( కుమాయిల్‌ నాజియాని) మధ్య సాగే చిత్రం. అయితే ఓ రాత్రి, వారు చేయని నేరాన్ని ఈ జంట పై బలవంతంగా రుద్దుతారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం తమ పై వచ్చిన ఆరోపణలను ఈ జంట ఎలా క్లియర్ చేసుకున్నారు ? అలాగే వారి మధ్య ఉన్న సంబంధ సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది మిగతా కథ.

 

ఏం బాగుంది :

ప్రధాన జంట ఇస్సా రెయ్ మరియు కుమాయిల్‌ నాజియాని నటన బాగుంది, అలాగే వారి మధ్య కెమిస్ట్రీ, వారి సంబంధంకి సంబంధించి వివిధ దశలలో వారి విరుద్ధమైన వ్యక్తిత్వాలను సరిగ్గా తమ నటనలో ఇస్సా రే మరియు కుమాయిల్‌ నాజియానిచూపించగలిగారు. అలాగే ఇద్దరూ కొన్ని సీన్స్ లో తీసుకువచ్చే హాస్యం కూడా బాగుంది. కథలో ప్రేరేపించబడిన క్రైమ్ యాంగిల్ కూడా బాగుంది. బిజియమ్ మరియు కెమెరా పనితనం చాలా బాగుంది.

 

ఏం బాగాలేదు :

కథాంశం ఆశాజనకంగా ఉన్నప్పటికీ, దాన్ని అమలు చేసిన విధానం ముఖ్యంగా ట్రీట్మెంట్ బాగాలేదు. మొదటి నుండే ఫ్లాట్ గా సాగుతుంది. ఇసా మరియు కుమాయిల్ బాగా నటించినా, వాఋ మధ్య వచ్చే సన్నివేశాలు ఇంట్రస్ట్ గా సాగకపోగా విసిగిస్తాయి. ఈ జంట మధ్య సాగే ట్రాక్ ఒక డ్రాగ్ లా, మొదటి 30 నిమిషాల తర్వాత చాల విషయాలు నిజంగా బోరింగ్ అనిపిస్తాయి. పైగా సినిమాలోని ఎమోషన్స్ చాలా బలహీనంగా ఉన్నాయి.

 

చివరి మాటగా :

 

మొత్తానికి, ది లవ్ బర్డ్స్ చూడాలంటే.. మీకు చాలా ఓపిక మరియు సమయం ఉంటేనే చూడండి. ఎలాగూ మనమందరం లాక్ డౌన్ లో చిక్కుకుని ఖాళీగా ఉన్నామనుకుంటే.. దీనిని చూడొచ్చు. కాని, ఈ గందరగోళ మరియు బోరింగ్ చిత్రంలో వినోదభరితమైన మరియు ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు.

Rating: 2/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు