లాక్ డౌన్ రివ్యూ: వాట్ ఆర్ ది ఆడ్స్? హిందీ/ఇంగ్లీష్(నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ: వాట్ ఆర్ ది ఆడ్స్? హిందీ/ఇంగ్లీష్(నెట్ ఫ్లిక్స్)

Published on May 27, 2020 2:48 PM IST

నటీనటులు : యశస్విని దయామా, కరణ్‌వీర్ మల్హోత్రా, అభయ్ డియోల్, మోనికా డోగ్రా

నిర్మాత: అభయ్ డియోల్

దర్శకుడు: మేఘన రామ స్వామి

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నేడు హిందీ/ఇంగ్లీష్ మూవీ వాట్ ఆర్ ది ఆడ్స్? ఎంచుకోవడం జరిగింది. మేఘా రామస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీ ఎలా ఉందొ సమీక్షలో చూద్దాం…

కథాంశం ఏమిటీ?

స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్న ఇద్దరు టీనేజర్స్ వివేక్ (యషస్విని దయామా) మరియు అశ్విన్ (కరణ్వీర్ మల్హోత్రా) అనుకోకుండా ఓ రోజు కలుస్తారు.వారి మధ్య పరిచయం చిన్నగా స్నేహంగా మారుతుంది. ఈ స్నేహంలో వారి మధ్య అనేక విషయాలు చర్చకు వస్తాయి. అలాగే భిన్న స్వభాలు కలిగిన వ్యక్తులతో వారికి కొత్త రకమైన అనుభవాలు ఎదురవుతాయి. టీనేజ్ లో ఉండే ఒక అమ్మాయి మరియు అబ్బాయి పై వయసు ప్రభావం వారిని ఎటువైపు నడిపించింది, వారికి ఎదురైన అనుభవాలకు వారు ఎలా స్పందించారు? అనేదే వాట్ ఆర్ ది ఆడ్స్?…

ఏమి బాగుంది?

టీనేజ్ లో వయసు ప్రభావం వలన వచ్చే ఆలోచనలు వాటికి యూత్ స్పందించే తీరు ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ప్రధాన పాత్రలు జీవితాలలో జరిగే సంఘటనలు ఆసక్తి రేపుతాయి. ఇక కథలో ప్రధానమైన టీనేజర్స్ గా కనిపించిన యషస్వినీ మరియు కరణ్వీర్ నటన క్యూట్ గా ఆకట్టుకుంది. ముఖ్యంగా కరణ్వీర్ అద్భుతంగా నటించాడు. అతనికి బాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంది అనిపిస్తుంది.

ఇక ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో అనేక సిరీస్ లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న యషస్విని దయామా ఎప్పటిలాగే బెస్ట్ పెరఫామెన్స్ ఇచ్చింది. అభయ్ డియోల్ తన పాత్ర పరిధిలో మెప్పించారు. లీడ్ పెయిర్ మధ్య వచ్చే ఫిషింగి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

ఏమి బాగోలేదు?

ఈ రొమాంటిక్ డ్రామాలో బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏమి ఉండదు. టీనేజర్స్ కు ఎదురైయ్యే సంఘటనలు దానికి వారు స్పందించిన తీరు ఇలా కథ చాలా సాదాసీదాగా సాగుతుంది. నెమ్మదిగా సాగే కథనం ఆర్ట్ ఫిలిం ని తలపిస్తుంది. ఎమోషన్స్ కొంచెం బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.

చివరి మాటగా

ఇద్దరు టీనేజర్స్ కి కొన్ని విషయాలకు ఎలా స్పందిస్తారు, వాటి నుండి వారు ఎలా బయటపడతారు అనే తీరుగా సాగే ఈ కథలో చెప్పుకోదగ్గ కొత్తదనం ఏమి లేదు. ఐతే ప్రధాన పాత్రలు చేసినవారి నటన మరియు అక్కడక్కడా ఆకట్టుకొనే సన్నివేశాలు కొంచెం ఉపశమనం ఇస్తాయి. కానీ తప్పకుండా చూడాల్సిన సినిమా ఐతే కాదు.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు