కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ డ్రామా ‘DC’ ఓటీటీ విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా విశేష ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరో ఓటీటీ వేదిక ద్వారా ఉత్తరాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం ఈ చిత్రం ‘సన్ నెక్స్ట్’ (Sun NXT) వేదికగా కేవలం దక్షిణాది భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సోనీ లివ్’ (Sony LIV) రంగంలోకి దిగింది. అక్టోబర్ 16, 2026 నుంచి ‘DC’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను తమ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో హిందీ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు త్వరలోనే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటి కలెక్షన్ల జోరు చూపించింది. అనిరుధ్ రవిచందర్ అందించిన చార్ట్‌బస్టర్ ఆల్బమ్, నేపథ్య సంగీతం సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రంలో లోకేష్ సరసన వామికా గబ్బి కథానాయికగా నటించగా.. సంజన కృష్ణమూర్తి, కస్తూరి రాజా, అవినాష్ రఘుదేవన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.


