
‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తన రెండవ సినిమా ‘కంచె’ షూటింగ్ ఫినిష్ చేసి ఆ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చేయడానికి సిద్దం చేస్తున్నాడు. ఇదిలా ఉండగానే అప్పుడే తన మూడవ సినిమా సినిమా ‘లోఫర్’ షూటింగ్ ని చివరి దశకు తీసుకువచ్చేసాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమా గత కొద్ది రోజులుగా రాజస్థాన్ లోని జైసల్మీర్, జోధ్పూర్ లలో ఈ సినిమాలోని మేజర్ పార్ట్ ని షూట్ చేసారు. రాజస్థాన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం గోవా చేరుకోనుంది.
గోవాలో సినిమా షూటింగ్ ని కంటిన్యూగా షూట్ చేయడమే కాకుండా ఎడిటింగ్ ని కూడా అదే టైంలో ఫినిష్ చేయాలని ప్లాన్ చేసారు. పూరి జగన్నాధ్ ఎప్పుడూ షూటింగ్ తో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేస్తుంటాడు. టెంపర్ సినిమాకి కూడా షూట్ చేస్తూనే ఎడిటింగ్ వర్క్ ని ఫినిష్ చేసాడు. ఇప్పుడే అదే ఫార్మాట్ ని ‘లోఫర్’ విషయంలో కూడా ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే 60%కి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం సెప్టెంబర్ చివరిలోపు ఈ సినిమా షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేయనున్నారు. వరుణ్ తేజ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నోర ఫతేహి ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.