‘అత్తారింటికి దారేది’ రేంజ్ హిట్ అవుతుంది – గోపీచంద్

‘అత్తారింటికి దారేది’ రేంజ్ హిట్ అవుతుంది – గోపీచంద్

Published on Sep 15, 2014 12:07 PM IST

Loukyam
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ బద్దలు కొట్టడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లౌక్యం’. ఈ సినిమా ఆడియో నిన్న విజయవాడలో జరిగింది. ఈ వేడుకలో గోపీచంద్ అత్తారింటికి దారేది స్థాయిలో లౌక్యం హిట్ అవుతుందని అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, నాకు లౌక్యం సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని’ అన్నాడు.

శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ వారు నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు