ప్రేమ, పెళ్లి, విడిపోవడం – రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ ట్రైలర్

ప్రేమ, పెళ్లి, విడిపోవడం – రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ ట్రైలర్

Published on Sep 21, 2014 6:27 PM IST

ishq-wala-love
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయ్ దర్శకురాలిగా మారి తెరకెక్కించిన తొలి సినిమా ‘ఇష్క్ వాలా లవ్’. మరాఠీలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదల చేశారు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ప్రేమను కాపాడుకోవడానికి పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే ప్రేమ ఫినిష్. అనే డైలాగులు రేణు దేశాయ్ నిజ జీవితానికి కొంచం దగ్గరగా ఉండడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. లవ్, బ్రేక్ అప్, మ్యారేజ్ నేపధ్యంలో రూపొందించిన ‘ఇష్క్ వాలా లవ్’ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఫస్ట్ టైం చూడగానే ఆకట్టుకుంది. రెండు సార్లు లవ్ బ్రేక్ ఆప్ అయిన అమ్మాయిగా హీరోయిన్ నటించింది. దాంతో సినిమాపై ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. విడుదలయ్యకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

‘ఇష్క్ వాలా లవ్’ సినిమా తెలుగు ఆడియో త్వరలో విడుదల చేయనున్నట్టు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తెలిపారు. ఈసినిమాలో దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు పాటలను కంపోజ్ చేశారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ అతిధి పాత్రలో నటించాడు.

‘ఇష్క్ వాలా లవ్’ ట్రైలర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

తాజా వార్తలు