సెన్సార్ పూర్తి చేసుకున్న “లవ్ మీ”

సెన్సార్ పూర్తి చేసుకున్న “లవ్ మీ”

Published on May 22, 2024 10:21 PM IST

ఆశిష్ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ లవ్ మీ. మే 25, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది ఈ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఒక దెయ్యంతో హేరో ప్రేమలో పడతాడు. దెయ్యంగా ఎవరు నటించారు అనే విషయాన్ని చిత్ర బృందం వెల్లడించలేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న లవ్ మీ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత మరియు నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు