“లవ్ మీ” 2 రోజుల వసూళ్లు ఇవే!

“లవ్ మీ” 2 రోజుల వసూళ్లు ఇవే!

Published on May 27, 2024 6:30 PM IST


ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ మీ చిత్రం శనివారం థియేటర్ల లోకి వచ్చింది. ఇఫ్ యు డేర్ అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ చిత్రం కి సంబందించిన రెండు రోజుల వసూళ్ల వివరాలను మేకర్స్ తాజాగా, సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం రెండు రోజుల్లో 7.35 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.

లవ్‌ మీ చిత్రానికి సీక్వెల్‌ ను కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్. కిల్‌ మి ఇఫ్‌ యు లవ్‌ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. హర్షిత్ రెడ్డి, హన్షిత మరియు నాగ మల్లిడి సంయుక్తంగా ఈ లవ్ మీ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు