సరికొత్తగా ఆకట్టుకుంటున్న లవ్ మీ ట్రైలర్

సరికొత్తగా ఆకట్టుకుంటున్న లవ్ మీ ట్రైలర్

Published on May 16, 2024 6:16 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ హీరోగా రాబోతున్న హారర్ ప్రేమకథ “లవ్ మీ”. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్‌లైన్. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఈరోజు ఓ ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రేక్షకులను ఈ ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ ను చూస్తుంటే సినిమాలో మంచి కథతో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయని అర్థం అవుతుంది.

ఏదైతే చేయకూడదు అని చెబుతారో… అలాంటి పనులే చేసే వ్యక్తిగా ఆశిష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. హీరో ఓ శిథిలావస్థలో ఉన్న భవనానికి వెళ్లి ఒక దెయ్యంతో ప్రేమలో పడతాడు. మానవుడు దెయ్యంతో ప్రేమలో పడాలనే ఆలోచనతో సాగిన ఈ ట్రైలర్ మొత్తానికి ఆకట్టుకుంది. సాంకేతికంగా కూడా ఈ ట్రైలర్ చాలా బాగుంది. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు