అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా టైటిల్. ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. పైగా ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందునా సాయి పల్లవి హీరోయిన్ కావడం అంచనాలను మరింత పెంచింది. ఇక ‘సారంగ దరియా’ సాంగ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. యూట్యూబ్ వ్యూస్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటతోనే సినిమాకు విపరీతమైన ప్రచారం లభించింది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేయనున్నారు. సినిమా లవ్ స్టోరీ కావడం అందునా సాయి పల్లవి కథానాయకి కావడంతో చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ అదే రోజున విడుదల చేయనున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య వర్క్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో, సాయి పల్లవి, నాగ చైతన్య ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేయడంతో సినిమా ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ మూవీలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.


