ఈ మెగా హీరో మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించేనా?

ఈ మెగా హీరో మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించేనా?

Published on Jul 10, 2024 1:00 AM IST

మెగా హీరోలతో ఒకరైన అల్లు శిరీష్ చివరిసారిగా ఊర్వశివో రాక్షసివో చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం తర్వాత రిలీజ్ కి రెడీ అయిపోయిన చిత్రం బడ్డీ. జూలై 26, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. ఈ చిత్రం తో విజయం సాధించాలి అని అల్లు శిరీష్ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుండి టీజర్‌, రెండు పాటలు విడుదలైనప్పటికీ ప్రేక్షకుల్లో చెప్పుకోదగ్గ బజ్‌ను సృష్టించలేక పోయింది.

సినిమాను అంతగా ప్రమోట్ చేయడం లేదని అర్థం అవుతుంది. ప్రతిష్టాత్మకమైన బ్యానర్ స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై నిర్మించిన ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు. శాన్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, మహమ్మద్ అలీ, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచి బాక్సాఫీస్ ఓపెనింగ్‌లను సాధించడానికి బడ్డీ తన ప్రచార వ్యూహాన్ని పెంచుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు