దుల్కర్ “లక్కీ భాస్కర్” రిలీజ్ డేట్ ఫిక్స్!

దుల్కర్ “లక్కీ భాస్కర్” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on May 29, 2024 10:00 PM IST

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్, సీతారామం చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో మరొక బ్యూటీ అయేషా ఖాన్ కూడా కనిపించనుంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. అదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ యొక్క ఓజి థియేటర్ల లోకి రానుంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు