నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలంటున్న నితిన్

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలంటున్న నితిన్

Published on Dec 27, 2019 4:26 PM IST

Bheeshma 2

యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ. దర్శకుడు వెంకీ కుడుముల రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. బ్యూటీ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుండి నేడు ఫస్ట్ సింగిల్ విడుదలైనది. సింగిల్స్ యాంథం పేరుతో విడుదలైన ఈ సాంగ్ లవర్ లేక అల్లాడిపోతున్న బ్యాచ్లర్ నితిన్ లైఫ్ ని వివరించేదిగా ఉంది. గర్ల్ ఫ్రెండ్ లేని లైఫ్ ఎంత బోరింగో తెలిపేలా శ్రీచరణ్ లిరిక్స్ బాగున్నాయి. సంధర్భానికి తగ్గట్టుగా స్వర సాగర్ వినసొంపైన ట్యూన్స్ కట్టగా సింగర్ అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు.

మొత్తానికి భీష్మ చిత్రంలోని మొదటి సాంగ్ ఆకట్టుకునేలా బాగుంది. భీష్మ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియోతో ఆకట్టుకున్న చిత్ర యూనిట్, ఫస్ట్ సాంగ్ ద్వారా యూత్ కి మరింత చేరువయ్యారు. సితార ఎంటరైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భీష్మ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

లిరికల్ వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు