మూడు రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ న్యూ ఇయర్ సంధర్భంగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో మా అసోసియేషన్ లో జరుగుతున్న పరిణామాలను వ్యతిరేకంగా ‘మా’ వైస్ ప్రెసిడెంట్ హీరో రాజశేఖర్ బహిరంగ విమర్శలకు దిగారు. ఆయన మీడియా సమక్షంలో వేదికపై చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు వంటి పెద్దలు ఉండగానే మీడియా సమక్షంలో తీవ్ర అసహనం తెలియజేశారు. ఈ చర్యలకు చిరంజీవి ఆగ్రహానికి గురయ్యారు.
ఐతే ఆ మరుసటి రోజు రాజశేఖర్ తన వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. కాగా నేడు ‘మా’ సభ్యులు ఆయన రాజీనామాను అంగీకరిస్తూ లెటర్ విడుదల చేశారు. అలాగే చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు, జయసుధ సభ్యులుగా ఒక డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ‘మా’ లో చాలా కాలంగా అనేక గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ‘మా’ లో చోటు చేసుకుంటున్న వరుస వివాదాలు ఆ సంస్థ గౌరవాన్ని మసకబారుస్తున్నాయి.


