Box Office: సమంత స్టామినా అంటే ఇదీ.. ‘మా ఇంటి బంగారం’ టికెట్ల సేల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Box Office: సమంత స్టామినా అంటే ఇదీ.. ‘మా ఇంటి బంగారం’ టికెట్ల సేల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Published on Jun 21, 2026 10:59 AM IST

ముఖ్య అంశాలు

  • సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
  • ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’ (BMS)లో ఈ సినిమా ఇప్పటికే 5 లక్షలకు పైగా టికెట్ల అమ్మాకాలను నమోదు చేసి రికార్డ్ సృష్టించింది.
  • పాజిటివ్ మౌత్ టాక్, వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో భలే సందడి చేస్తోంది. నందినీ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, టికెట్ సేల్స్‌లోనూ సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. తాజాగా ఈ మూవీ మరో సాలిడ్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుని, బాక్సాఫీస్ బరిలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.

ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో (BookMyShow)లో ఈ సినిమా టికెట్ల విక్రయాలు ఏకంగా ఐదు లక్షలు (500K) దాటేశాయి. కేవలం ఒక్క ప్లాట్‌ఫామ్‌లోనే ఈ రేంజ్‌లో టికెట్లు అమ్ముడవడమంటే, ప్రేక్షకుల నుంచి సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొదటి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ రావడం, మేకర్స్ ప్లాన్ చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్, నటీనటుల అద్భుతమైన పర్ఫార్మెన్స్.. ఇవన్నీ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఊపు చూస్తుంటే, మొదటి రెండు రోజుల వసూళ్లను ఆదివారం కలెక్షన్స్ సునాయాసంగా దాటేసేలా కనిపిస్తున్నాయి. దీనికి తోడు, ప్రేక్షకులను ఆకర్షించే స్థాయిలో గట్టి పోటీ ఇచ్చే మరో పెద్ద సినిమా ఏదీ థియేటర్లలో లేకపోవడం ‘మా ఇంటి బంగారం’కు బాగా కలిసొచ్చింది. ఈ సానుకూల వాతావరణం వల్ల రాబోయే వారం రోజులు కూడా ఇదే హవా కొనసాగడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో దిగంధ్ మంచలే, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి ఓ వైపు నటిగా, మరోవైపు నిర్మాతగా సమంతకు ఈ సినిమా డబుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి.

తాజా వార్తలు