మా ఇంటి బంగారం.. మరింత ఆలస్యం కానుందా..?

మా ఇంటి బంగారం.. మరింత ఆలస్యం కానుందా..?

Published on May 5, 2026 10:27 PM IST

Maa-Inti-Bangaaram

సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం మే 15న విడుదల కావడం లేదని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయినప్పటికీ, జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వస్తుండటంతో క్లాష్‌ను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వాయిదా పడటం వల్ల ఒక మంచి రిలీజ్ డేట్‌ను కోల్పోయినట్టయింది. ​ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ మూవీకి మంచి అవకాశం ఉండేది. సత్యదేవ్ ‘రావు బహదూర్’ కూడా ‘పెద్ది’ ప్రభావంతో వాయిదా పడే అవకాశం ఉంది.

సమంత తన కంబ్యాక్ కోసం ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకుంది, కాబట్టి జూన్ చివరలో లేదా జూలైలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు