కన్నడలోకి వెళ్తున్న నీలకంఠ ‘మాయ’..!

కన్నడలోకి వెళ్తున్న నీలకంఠ ‘మాయ’..!

Published on Aug 4, 2014 3:20 PM IST

maaya_movie
గత శుక్రవారం విడుదలైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మాయ’. జరగబోయేది(భవిష్యత్) ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? అనే ఉంటుంది అనే వైధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ రీమేక్ రైట్స్ ను అప్పుడే అమ్మేశారు. ‘ప్రేమ కధా చిత్రమ్’ను కన్నడలో రీమేక్ చేసిన నిర్మాతలు శ్రీధర్ రెడ్డి(ధనలక్ష్మి ప్రింటర్స్) & మురగప్పాన్ లు ‘మాయ’ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.

హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్‌ నటినటులుగా రూపొందిన ‘మాయ’ చిత్రానికి జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వం వహించారు. ఎమ్‌.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్‌ నిర్మాతలు.

తాజా వార్తలు