శరవేగంగా “మ్యాడ్ 2” మూవీ షూటింగ్!

శరవేగంగా “మ్యాడ్ 2” మూవీ షూటింగ్!

Published on Apr 15, 2024 9:00 PM IST

నార్నే నితిన్, సంగీత్ శోభన్, నితిన్ రామ్ లు ప్రధాన పాత్రల్లో, దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం. ఈ చిత్రం కి సంబందించిన సీక్వెల్ షూటింగ్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గుంటూరు కారం హౌజ్ లో జరుగుతున్నట్లు.

ఈ చిత్రం ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యాడ్ మ్యాక్స్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియ, అనంతిక, గోపిక ఉదయన్ లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సీసీరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు