బాహుబలి ద్వారా ప్రపంచానికి పరిచయమైన మదన్

బాహుబలి ద్వారా ప్రపంచానికి పరిచయమైన మదన్

Published on Jul 24, 2015 12:22 AM IST

Madan-Karky
బాహుబలి చిత్రానికి పనిచేసిన ప్రధాన టెక్నీషియన్లు ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్ లో వున్నారు. వారి కష్టానికి తగ్గ ఫలితం తెరమీద చూసుకుని తెగ సంబరపడుతున్నారు. డైలాగ్ రైటర్ మదన్ కార్కేకి సైతం ఈ సినిమా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చిపెట్టింది.

మదన్ ఈ సినిమాకు తమిళ వెర్షన్ డైలాగులను అందించడమేకాక కాలకేయ పాత్రకు సంబంధించిన కిల్ కిల్ బాషను కూడా రచించారు. సమాచారం పెద్ద పెద్ద తమిళ ఆఫర్లు మదన్ కు దక్కుతున్నాయట. మదన్ తమిళ ప్రముఖ పాటల రచయత వరైముత్తు కొడుకు. మదన్ ఇప్పటికే ఐ, రోబో, తుపాకీ మరియు కత్తి సినిమాలకు పనిచేసాడు.

తాజా వార్తలు